రవ్వ క్యాప్సికమ్‌ పకోడి
 • 396 Views

రవ్వ క్యాప్సికమ్‌ పకోడి

కావలసినవి:

 • బొంబాయి రవ్వ - 2 కప్పులు,
 • ఉల్లిపాయలు - 2
 • క్యాప్సికమ్‌ - 1,
 • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు
 • ధనియాల పొడి - 1 స్పూన్‌,
 • కారం - 1 స్పూన్‌
 • పసుపు - చిటికెడు,
 • ఉప్పు - తగినంత
 • వంట సోడా - చిటికెడు,
 • పెరుగు - కలపడానికి సరిపడా

విధానం:

ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ సన్నగా తరగాలి. బొంబాయి రవ్వలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి పెరుగుతో పకోడీ పిండిలా కలపాలి. బాండీలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని పకోడీల్లా వేసి ఎర్రగా వేయించితే కరకరలాడే రవ్వ పకోడీ రెడీ