బొంబాయి రవ్వ, కొబ్బరి కోరు పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. నీళ్లు మరిగించి చక్కెర వేయాలి. చక్కెర
కరిగిన తరువాత కొద్దికొద్దిగా రవ్వ వేస్తూ ఉండకట్టకుండా కలపాలి. మూత పెట్టి తక్కువ మంటమీద ఉడకనివ్వాలి. నీళ్లు ఇంకిపోయి మిశ్రమం దగ్గరపడ్డాక నెయ్యి, యాలకుల పొడి, కొబ్బరి కోరు కలిపి మూత పెట్టేయాలి. మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేసు కోవాలి. మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసుకోవలి. గోధుమపిండిని నీళ్లతో కలుపుకుని కొద్దిగ వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిలో ఉడికించిన బొంబాయి రవ్వ, కొబ్బరి మిశ్రమం ఉండలు పెట్టి వత్తుకోవాలి. పెనంమీద నెయ్యితో కాల్చుకుంటే చాలా బావుంటాయి.