రవ్వ పులిహోర
  • 282 Views

రవ్వ పులిహోర

కావలసినవి:

  • బియ్యంరవ్వ: 2 కప్పులు,
  • నిమ్మకాయలు: 2,
  • ఇంగువ: అరటీస్పూను,
  • వేరుసెనగ గింజలు: టేబుల్‌స్పూను,
  • ఉప్పు: సరిపడా,
  • నూనె: 6 టీస్పూన్లు,
  • పసుపు: టీస్పూను,
  • కరివేపాకు: 4 రెబ్బలు,
  • పచ్చిమిర్చి: 2, పోపుకోసం:
  • ఆవాలు: అరటీస్పూను,
  • ఎండుమిర్చి: 2,
  • సెనగపప్పు: 2 టీస్పూన్లు,
  • మినప్పప్పు: 2 టీస్పూన్లు

విధానం:

*బియ్యం రవ్వలో పసుపు, టీస్పూను ఉప్పు, టీస్పూను నూనె వేసి ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. 3 విజిల్స్‌ వచ్చాక దించి ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లారనివ్వాలి.
* బాణలిలో 5 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఇంగువ, వేరుసెనగగింజలు వేసి వేగాక మిగిలిన పోపు దినుసులు కూడా వేసి కరివేపాకు వేసి చిటపటమన్నాక దించాలి.
* ఈ తాలింపులోనే నిమ్మరసం పిండి, సరిపడా ఉప్పు వేసి రవ్వలో కలపాలి. చివరగా కొత్తిమీర చల్లితే నోరూరించే రవ్వ పులిహోర రెడీ. ఇష్టమైతే క్యారెట్‌ తురుము కూడా కలుపుకోవచ్చు.