రవ్వ వడియాలు
  • 515 Views

రవ్వ వడియాలు

కావలసినవి:

  • బొంబాయి రవ్వ - అరకిలో
  • ఉప్పు - తగినంత, అల్లం - అరంగుళం ముక్క
  • పచ్చిమిర్చి - 6, జీలకర్ర - 3 టేబుల్‌ స్పూన్లు

విధానం:

రెండు లీటర్ల నీళ్లను గిన్నెలో పోసి మరగబెట్టాలి. ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి నూరుకొని మరిగే నీళ్లలో వేయాలి. తర్వాత రవ్వ వేసి కలియదిప్పుతుంటే ముద్ద అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టౌమీద నుండి దింపుకోవాలి. ఇది కొద్దిగా ఆరిన తర్వాత చక్రాల గిద్దెల్లో పెట్టి చిన్న చిన్న చక్రాలుగా వత్తుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇలా రెండు మూడు రోజులు ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత వీటిని వేయించుకుంటే చాలా రుచిగా వుంటాయి.