రెడ్ మటన్ కర్రీ
 • 437 Views

రెడ్ మటన్ కర్రీ

కావలసినవి:

 • ఎముకలు లేని మాంసం... అర కేజీ
 • ఆలివ్ నూనె... 2 టీ.
 • ఉల్లిపాయ తరుగు... 150 గ్రా.
 • వెల్లుల్లి పేస్ట్... ఒక టీ.
 • మైదాపిండి... రెండు టీ.
 • కారం... ఒక టీ.
 • టమోటో తరుగు... 2 కప్పులు
 • క్యాప్సికమ్... పెద్దది ఒకటి
 • పెరుగుమీది పుల్లటి మీగడ... అర కప్పు
 • ఉప్పు... రెండు టీ.
 • నల్లమిరియాలపొడి... అర టీ

విధానం:

ఓ పాత్రలో నూనె వేడిచేసి అందులో మాంసం ముక్కలను వేసి అన్నివైపులా ఎర్రటిరంగు వచ్చేదాకా వేయించాలి. వేగిన తరువాత ముక్కలను తీసి పక్కనబెట్టి అదే పాత్రలో తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి, అవి వేగిన తరువాత పక్కనుంచిన మాంసం ముక్కల్ని కూడా వేయించాలి.

కారం, మైదాపిండిలను పై కూరకు పట్టించి సన్నటి మంటపై నూనె తేలేదాకా ఉడికించాలి. ఆపై తరిగిన టమోటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మాంసం ముక్కలు మెత్తబడేదాకా ఉంచాలి. చివర్లో తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి మరి కాసింతసేపు ఉడికించాలి. ఇలా తయారైన వేడి వేడి మటన్ కర్రీపై పుల్లటి పెరుగు మీది మీగడను అలంకరించి అతిథులకు సర్వ్ చేయండి.