పుదీనా రైస్‌
 • 358 Views

పుదీనా రైస్‌

కావలసినవి:

 • పుదీనా - 2 కట్టలు,
 • బాస్మతి బియ్యం - 2 కప్పులు,
 • పచ్చి కొబ్బరి తురుము - పావుకప్పు,
 • పచ్చిమిర్చి - 3,
 • ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి)
 • అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్‌,
 • లవంగాలు - 4,
 • యాలకులు - 4,
 • దాల్చిన చెక్క - 4,
 • పలావు ఆకులు - 4,
 • అనాసపువ్వు - ఒకటి,
 • వేయించిన జీడిపప్పు - పావుకప్పు,
 • నెయ్యి - 2 టీస్పూన్లు,
 • ఉప్పు - సరిపడినంత

విధానం:

ముందుగా పుదీనా ఆకులను తుంచుకొని బాగా కడగి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా... రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టు కోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పును మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా అయ్యే వరకూ గ్రైండ్‌ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్ట వ్‌ మీద ఓ మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ పె ట్టి నెయ్యి వేసి అది మరిగాక మసాలా దిను సులు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ము ద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయిం చుకోవాలి. ఇవి వేగాక గ్రైండ్‌ చేసి ఉం చుకున్న పుదీనా పేస్టును వేసి రంగు మారే వరకూ వేయించుకోవాలి.
ఈ విశ్రమం ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారిన తర్వాత నానబెట్టకున్న బియ్యం, నీళ్లతో సహా వేసి గరిటెతో బాగా కలపి ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్‌ ఉపయోగించినట్లయితే మూతపై బరువు పెట్టాల్సిన అవసరం లేదు. అదే మందపాటి పాత్రను ఉపయోగించినట్లయితే దాని మూత ఉంచుకోవాలి.
అన్నం బాగా పొడిపొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి. దీనికి సైడ్‌ డిష్‌గా గ్రేవీగా చేసుకున్న ఏదైనా మసాల కర్రీని కానీ... లేదా పెరుగు చట్నీని కలిపి కూడా సర్వ్‌ చేసుకోవచ్చు.