కుక్కర్లో నెయ్యివేసి బాగా కాగాక జీడిపప్పు, జీలకర్ర వేయించాలి. కడిగిన బియ్యం, పైన చెప్పిన అన్ని పప్పులూ వేసి 2 నిమిషాలు వేయించాలి. వాటికి రెండింతలు నీళ్లు, ఉప్పు, పాలు పోసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించాలి. చల్లారిన తర్వాత మూత తీసి గరిటతో బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే పంచపప్పుల రైస్ రెడీ.