మటన్ రోస్ట్
  • 415 Views

మటన్ రోస్ట్

కావలసినవి:

  • మటన్ - కప్పు
  • పసుపు - టీ స్పూన్
  • కారం - టీ స్పూన్
  • ఉల్లిపాయ ముక్కలు - కప్పు
  • మిరియాల పొడి - టీ స్పూన్
  • చాట్ మసాలా - టీ స్పూన్
  • నిమ్మరసం - టీ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • నూనె - వేయించడానికి సరిపడినంత

విధానం:

బాణలిలో నూనె వేడి చేసి మటన్ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అవి వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మాంసం ముక్కలు వేసి కలిపి పైన చాట్‌మసాలా, మిరియాల పొడి చల్లి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరగా నిమ్మరసం కలిపి దించేయాలి. మటన్ రోస్ట్ రెడీ.