ఖర్జూర రోల్స్‌
  • 620 Views

ఖర్జూర రోల్స్‌

కావలసినవి:

  • ఖర్జూరాలు - అర కిలో,
  • పాలు - లీటరు
  • అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ - అర కప్పు
  • నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు,
  • అలంకరణ కోసం కొబ్బరి పొడి, వాల్‌ నట్స్‌

విధానం:

ఖర్జూరాల్లోని గింజలు తీసి చిన్న పలుకుల్లా చేసుకోవాలి. వీటిని నేతిలో 20 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక పాలు పొయ్యాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత డ్రైఫ్రూట్స్‌ పలుకులు కలిపి స్టౌ మీద నుండి దింపేయాలి. వేడి తగ్గాక ఫ్రిజ్‌లో పెట్టాలి. వీటిని రోల్స్‌లా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్ది, పైన వేయించిన వేరుశనగ పప్పు పలుకులు పెడితే సరి. కమ్మటి ఖర్జూర రోల్స్‌ నోరూరిస్తాయి.