రోజ్‌ పానీ
  • 273 Views

రోజ్‌ పానీ

కావలసినవి:

  • గులాబీ రేకులు... పదిహేను
  • చల్లటినీరు... ఒక లీ.
  • పంచదారపొడి... పదిహేను టీ.
  • నిమ్మకాయ.. అర చెక్క
  • యాలకుల పొడి... పావు టీ.

విధానం:

మిక్సీ జార్‌లో గులాబీ రేకులు, పంచదార పొడి, యాలకులపొడి, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీన్ని లీటరు నీటిలో కలపాలి. కొత్త కుండకు తడిబట్ట చుట్టి గులాబీ మిశ్రమం కలిపిన నీటిని అందులో పోసి మూత పెట్టాలి. మూడు గంటలపాటు కుండను తడుపుతూ ఉండాలి.

అంతే... తియ్యగా, కొద్దిగా పుల్లగా, కాస్త వగరుగా అనిపించే రోజ్‌పానీ తయార్..! దీనిని మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా ఎండ తాపాన్ని తగ్గించి శరీరానికి మంచి ఉల్లాసాన్నిస్తుంది.