గ్రేవీ కోసం:
వీటికి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ముందుగా ప్రాన్స్ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి. అందులో ఉడికించిన ప్రాన్స్, జీడిపప్పు, పావు కప్పు నీరు, గసగసాల మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ సెగ మీద పది నిమిషాల సేపు ఉడికించాలి. ఇప్పుడు కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపి మిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న సెగ మీద ఉడికించాలి. ఇప్పుడు రొయ్యల ఇగురుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.