రష్యన్‌ సలాడ్‌
  • 385 Views

రష్యన్‌ సలాడ్‌

కావలసినవి:

  • పచ్చి బఠాణీలు.. ఒక కప్పు
  • బీన్స్, క్యారెట్ ముక్కలు.. చెరో కప్పు
  • బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్ ముక్కలు.. అన్నీ కలిపి రెండు కప్పులు
  • పాలు.. ఒక కప్పు
  • మైదా, వెన్న.. అర టీస్పూన్ చొప్పున
  • మిరియాల పొడి.. ఒక టీ.
  • ఉప్పు.. అర టీ.

విధానం:

ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియబెట్టాలి. పైన మిరియాలపొడి, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్ సలాడ్ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.