సగ్గుబియ్యాన్ని మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరువాత నీటిని పిండేయాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుంటే పిండిలా అవుతుంది. దీన్ని ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ ఉండల్ని అందులో వేసి ఎర్రగా వేయించుకుంటే సగ్గుబియ్యం బాల్స్ సిద్ధం.