సగ్గుబియ్యం ఉప్మా
  • 672 Views

సగ్గుబియ్యం ఉప్మా

కావలసినవి:

  • సగ్గుబియ్యం: 3 కప్పులు
  • వేరుశెనగపప్పు: ఒక కప్పుపచ్చిమిర్చి: 4
  • పచ్చి కొబ్బరి తురుము: 2 చెంచాలు
  • ఆవాలు, జీలకర్ర: ఒక చెంచా
  • నిమ్మరసం: అర చెంచా
  • నూనె: 2 చెంచాలు
  • కరివేపాకు: ఒక రెమ్మ
  • ఉప్పు, నీళ్ళు: తగినంత

విధానం:

సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టాలి. స్టౌ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. తరువాత సగ్గుబియ్యం, వేరుశెనగ పొడి, ఉప్పు వేయాలి. కాసేపటి తర్వాత నీళ్లు పోయాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక కొబ్బరి తురుము, నిమ్మరసం కలిపి దించేసుకోవాలి.