రొయ్యలు - సేమ్యా బిరియానీ
  • 325 Views

రొయ్యలు - సేమ్యా బిరియానీ

కావలసినవి:

  • పచ్చిరొయ్యలు - 250 గ్రా. (ఒలిచినవి)
  • సేమ్యా - 250 గ్రా;
  • నెయ్యి - 150 గ్రా;
  • జీడిపప్పు - 100గ్రా
  • లవంగాలు, ఏలకులు - తగినన్ని;
  • దాల్చినచెక్క - 5 గ్రా
  • ఉల్లికాడలు తరుగు - కప్పు;
  • ఉల్లిపాయలు - 2 (పెద్దవి)
  • పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు;
  • పెరుగు - కప్పు
  • నిమ్మరసం - 2 టీ స్పూన్లు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు
  • ఉప్పు, పసుపు, కారం - తగినంత
  • కొత్తిమీర, పుదీనా - చిన్నకట్ట చొప్పున

విధానం:

ఒక గిన్నెలో గ్లాసుడు నీరు పోసి మరిగాక అందులో సేమ్యా వేసి ఉడికించి పక్కన ఉంచుకోవాలి. బాణలి స్టౌ మీద ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కాగాక... ఉల్లితరుగు, జీడిపప్పు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి తరుగు వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి రెండు నిముషాలు వేయించాలి. ఇప్పుడు పచ్చిరొయ్యలు, పెరుగు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కలిపి, ఉడుకుతుండగా సేమ్యా వేసి బాగా కలిపి ఒక నిముషం ఉడికిన తరవాత నిమ్మరసం వేసి కలిపి దించేయాలి. కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి.