నూడుల్స్ సమోసా
 • 439 Views

నూడుల్స్ సమోసా

కావలసినవి:

 • మైదా - 250 గ్రా,
 • డాల్డా లేదా నెయ్యి - 50 గ్రా.,
 • ఉప్పు - చిటికెడు,
 • ఉడికించిన నూడుల్స్ - కప్పు,
 • ఉల్లి తరుగు లేదా ఉల్లిపరక తరుగు - పావు కప్పు,
 • క్యారట్, బీన్స్ ముక్కలు - పావు కప్పు,
 • క్యాబేజీ తరుగు - పావు కప్పు,
 • ఉప్పు - తగినంత,
 • మిరియాలపొడి - పావు టీ స్పూను,
 • అజినమోటో - చిటికెడు,
 • నూనె - తగినంత.

విధానం:

జల్లించిన మైదాలో కరిగించిన డాల్డా వేసి బాగా కలపాలి. తరవాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీలా కలిపి మూత పెట్టాలి. వెడల్పాటి ప్యాన్‌లో రెండు టీ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి. తరవాత కూరగాయ ముక్కలు వేసి వేగాక అజినమోటో వేసి కలిపి, ఉడికించిన నూడుల్స్, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి నీటి త డి పోయేవరకు వేయించి దింపేయాలి. కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా నూనె వేసి మరోమారు కలిపి చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను పొడిపిండి అద్దుకుంటూ పలుచగా పూరీలా ఒత్తుకోవాలి. దీనిని చాకుతో రెండు భాగాలుగా త్రికోణంగా కట్ చేసి, ఒక్కో ముక్క తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి, అంచులు విడిపోకుండా ఒత్తి మూసేయాలి. వేడినూనెలో ఈ సమోసాలు బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.