ముందుగా శనగపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత శనగపప్పుకు సరిపడా నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించుకోవాలి. గోధమపిండిలో నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం మధ్యస్తంగా తీసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు. ఇప్ప్పుడు ఉడికించిన శనగపప్పుని బాగా మెదిపి కొంచెం పప్పు కొంచెం మెత్తగా ఉండేటట్లుగా మెదపాలి. అందులో బెల్లం పాకం, యాలకుల పొడి వేసి ఉండలుగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడెక్కిన తరువాత ఆ ఉండలను ఒక్కోటిగా ఆ గోధుమపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే శనగపప్పు పూర్ణాలు తినడానికి సిద్ధం అయినట్టే. ఇష్టం అయినవాళ్ళు అందులో నెయ్యి వేసుకుని వేడి వేడిగా తింటే రుచిగా వుంటుంది