షత్రంజీ పులావ్
 • 513 Views

షత్రంజీ పులావ్

కావలసినవి:

 • బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పులు
 • ఎల్లో క్యాప్సికమ్ - ఒకటి
 • కుంకుమపువ్వు - కొద్దిగా
 • నూనె - తగినంత
 • ఉల్లితరుగు - పావుకప్పు
 • ఏలకులు - 3
 • బిరియానీ ఆకులు - 2
 • లవంగాలు - 3
 • దాల్చినచెక్క - చిన్న ముక్క
 • అల్లం తురుము - అర టీ స్పూను
 • సోంపు - టీ స్పూను,
 • నెయ్యి - 3 టీ స్పూన్లు
 • జీలకర్ర - టీ స్పూను
 • కిస్‌మిస్ - 10
 • జీడిపప్పు పలుకులు - 10
 • టొమాటో ముక్కలు - పావు కప్పు
 • ఉప్పు - తగినంత

విధానం:

మూడు కప్పుల నీటిలో బియ్యాన్ని గంటసేపు నానబెట్టాలి. నీరు వడకట్టాలి. రెండు టీ స్పూన్ల నీటిలో కుంకుమపువ్వును నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ఒక పెద్ద పాత్రలో రెండున్నర కప్పుల నీరు, బిరియానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, అల్లం తురుము, ఉప్పు, సోంపు వేసి స్టౌ మీద ఉంచి మరిగాక, దింపి నీటిని వడకట్టి, పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, ఏలకులు వేసి వేగాక, నానబెట్టిన బియ్యం, వడకట్టి ఉంచుకున్న నీరు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఉడకడం పూర్తవుతున్న సమయంలో జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి ఐదు నిముషాలుంచి దించేయాలి. వేయించి ఉంచుకున్న ఉల్లితరుగు, టొమాటో, కుంకుమపువ్వులతో గార్నిష్ చేయాలి.