సేమ్యా కట్‌లెట్స్
 • 294 Views

సేమ్యా కట్‌లెట్స్

కావలసినవి:

 • సేమ్యా - సగం కప్పు
 • ఉడికించిన బంగాళాదుంప పేస్ట్ - కప్పు
 • బ్రెడ్ పౌడర్ - 3 టీ స్పూన్లు
 • వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పు -
 • 3 టేబుల్‌స్పూన్లు
 • పచ్చిమిర్చి ముక్కలు - రెండు టీ స్పూన్లు
 • ఉల్లిపాయ - ఒకటి
 • ఉప్పు - రుచికి సరిపడా
 • కారం - టీ స్పూన్
 • జీలకర్ర - టీ స్పూన్
 • కొత్తిమీర - 3 టీ స్పూన్లు
 • నూనె - వేయించడానికి తగినంత
 • నిమ్మరసం - టీ స్పూన్

విధానం:

ముందుగా స్టౌపై గిన్నెపెట్టి సేమ్యాను నూనె లేకుండా గోధుమరంగు వచ్చే వరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో బంగాళదుంప పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్, వేరుశనగ పప్పులు, జీలకర్ర, కొత్తిమీర, సేమ్యా, నిమ్మరసం.. ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి ఐదునిముషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, కాగనివ్వాలి. తర్వాత సేమ్యా మిశ్రమాన్ని కావాల్సిన ఆకారంలో చేసుకొని బ్రెడ్ పౌడర్‌లో అటూ ఇటూ డిప్ చేసి నూనెలో వేయించుకోవాలి. రెడీ అయిన సేమ్యా కట్‌లెట్స్ వేడివేడిగా, కరకరలాడుతూ నోరూరిస్తాయి.