ఆలూ సేమ్యా
  • 292 Views

ఆలూ సేమ్యా

కావలసినవి:

  • బంగాళాదుంపలు... అర కేజీ
  • సేమియా... వంద గ్రా.
  • జీలకర్ర... రెండు టీ.
  • నూనె... ఒకటిన్నర టీ.
  • ఎండుమిర్చి పౌడర్... అర టీ.
  • పసుపు... అర టీ.
  • నిమ్మకాయ... ఒకటి

విధానం:

స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర వేయాలి. తరువాత ఉడికించి పొట్టుతీసిన బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఎండుమిర్చి పౌడర్, పసుపు, ఉప్పు కూడా వేసి కలిపి, పది నిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు బాగా వేయించిన సేమియాను వేసి కలిపి స్టవ్ మీదినుంచి దించి నిమ్మకాయ రసం పిండి వేడి వేడిగా వడ్డించాలి. అంతే ఆలూ సేమియా రెడీ..!