సేమ్యా పులిహోర
  • 154 Views

సేమ్యా పులిహోర

కావలసినవి:

  • సేమ్యా- కప్పు,
  • చింతపండు - నిమ్మకాయంత
  • శనగపప్పు - టీ స్పూన్
  • మినప్పప్పు - టీ స్పూన్,
  • జీడిపప్పు - 4 పలుకులు
  • ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్
  • ఇంగువ - చిటికెడు,
  • కరివేపాకు - రెమ్మ,
  • ఉప్పు - రుచికి సరిపడేంత
  • ఎండు మిర్చి - 4, పచ్చిమిర్చి - 4,
  • నూనె - 3 టీ స్పూన్లు

విధానం:

ముందుగా సేమ్యాను ఉడికించి, వార్చి, వెడల్పాటి ప్లేట్‌లో వేసి, విడదీసి ఆరనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి ఉప్పువేసి, ఉడికించి, చల్లారనివ్వాలి. చింతపండు గుజ్జును, సేమ్యాకు పట్టించి, పక్కన పెట్టుకోవాలి. స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సమంగా వేగనివ్వాలి. ఈ పోపును పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలిపి, ప్లేట్లలోకి సర్ది, జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.