నువ్వులు చికెన్‌ కర్రీ
  • 350 Views

నువ్వులు చికెన్‌ కర్రీ

కావలసినవి:

  • నువ్వులు - 4 టేబుల్‌ స్పూన్లు
  • చికెన్‌ - 1/2 కిలో
  • ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
  • పచ్చిమిర్చి -4 (ముక్కలు కోసుకోవాలి)
  • ఉప్పు, కారం, పసుపు, నూనె - తగినంత
  • అల్లం,వెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌స్పూన్‌
  • గరం మసాలా - 1టేబుల్‌ స్పూన్‌
  • నీళ్లు - తగినన్ని
  • కొత్తిమీర, పుదినా - 1/2 కప్పు (సన్నగా తరిగినది)

విధానం:

ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, తరిగిన కొత్తిమీర, పుదినా మిశ్రమం వేసి బాగా కలిపి అరగంటసేపు ఉంచాలి. నువ్వుల్ని దోరగా వేయించి మిక్సీ వేసుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. అందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్‌ మిశ్రమాన్ని వేసి నీరంతా ఇగరనివ్వాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి సన్న సెగమీద మగ్గనివ్వాలి. చివరిలో గరంమసాలా, నువ్వుల పొడి వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతే చికెన్‌ కర్రీ రెడీ. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి బాగుంటుంది. కొందరు జీడిపప్పు పేస్ట్‌ వేస్తారు. దానికన్నా నువ్వుల పేస్ట్‌ రుచిగా ఉంటుంది. ఖరీదు తక్కువ, ఆరోగ్యం. నువ్వులు చికెన్‌ కర్రీ