నువ్వులు పచ్చడి
  • 542 Views

నువ్వులు పచ్చడి

కావలసినవి:

  • నువ్వులు - 1 కప్పు,
  • టమాటాలు - 8
  • పచ్చిమిరపకాయలు - 15,
  • వెల్లుల్లి - 6 రెబ్బలు
  • జీలకర్ర - 1 టేబుల్‌ స్పూన్‌,
  • ఉప్పు - తగినంత
  • నూనె - తగినంత,
  • చింతపండు - తగినంత
  • కొత్తిమీర తురుము - కొద్దిగ

విధానం:

ముందు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నువ్వులు వేయించాలి. దోరగా వేగి, కమ్మటి వాసన రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు విడివిడిగా మగ్గనివ్వాలి. ఆఖరులో కొంచెం చింతపండు (పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు) కడిగి వేసి, స్టవ్‌ కట్టేయాలి. ఇది చల్లారాక ముందుగా నువ్వులు గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, చింతపండు, టమాటా ముక్కలు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే బాగోదు. నువ్వులు పచ్చడి దోసెల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.