నువ్వులు కుకీస్‌
 • 554 Views

నువ్వులు కుకీస్‌

కావలసినవి:

 • నువ్వులు - 4 టేబుల్‌ స్పూన్లు
 • మైదాపిండి - 1/4 కప్పు
 • వెన్న -1 టేబుల్‌ స్పూన్‌
 • పంచదార పొడి- 1 కప్పు
 • ఓట్సు - 3/4 కప్పు,
 • బేకింగ్‌ సోడా - 1 టేబుల్‌స్పూన్‌
 • బాదం పొడి - 1 టేబుల్‌ స్పూన్‌ (మరీ మెత్తగా చేయకూడదు)
 • నీళ్లు - తగినన్ని, ఉప్పు - చిటికెడు
 • క్యారమెల్‌ - 1 స్పూన్‌ (పంచదార ఉట్టి గిన్నెలో వేసి కొద్దిసేపు ఉంచి దింపేస్తే చాక్లెట్‌ కలర్‌ వస్తుంది.)
 • నెయ్యి -1 టేబుల్‌ స్పూన్‌

విధానం:

ముందు స్టవ్‌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని వెన్న వేయాలి. అది కరిగాక పంచదార పొడి, చాక్లెట్‌ కలర్‌ వేసి బాగా తిప్పాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. అదంతా దగ్గరగా అవుతుంది. అవసరమైతే కొద్దిగా వేడినీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండల్ని అరచేతికి నెయ్యి రాసుకుని వేళ్లతో గుండ్రంగా ఒత్తుకోవాలి. అలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని మైక్రో ఓవెన్‌లో పెట్టి సుమారు 20 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి.కేక్‌ ఓవెన్‌లో పెట్టి కూడా బేక్‌ చేసుకోవచ్చు. ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. గుడ్డు ఇష్టపడేవారు అది కూడా వేసుకోవచ్చు.