నూడిల్స్‌ని ఉడికించి, నీరంతా వడకట్టి ఆరబెట్టుకోవాలి. నూనెలో ఉల్లి, అల్లం తరుగును పెద్దమంట మీద ఒక నిమిషం పాటు వేగించి కూరగాయల ముక్కలు, మిరియాలపొడి, సోయాసాస్, ఉప్పు వేసి ఇంకో 4 నిమిషాలు వేగించాలి. వెనిగర్, నువ్వులు వేసి అర నిమిషం పాటు అన్నీ బాగా కలిసేలా పైనించి కిందకి ఎగరేయాలి. తర్వాత ఉల్లికాడల తరుగుతో అలంకరించాలి. వేడి వేడి నువ్వుల నూడిల్స్‌ని టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.