ముందుగా చేపలను కల్లుప్పుతో రుద్ది శుభ్రం చేసుకోవాలి. అప్పుడే జిగురు లేకుండా ఉంటాయి. వాటికి పసుపు, ఉప్పు, కారం చెంచా చేప మసాలా పొడిని కలిపి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల పాటు ఉంచితే ముక్కలకు ఉప్పు, కారం చక్కగా పడుతుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేడిచేసి నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చి మిర్చి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి బాణలితోపాటు తీసి పెట్టుకోవాలి. వేడి కొద్దిగా తగ్గాక అందులో కారం పట్టించిన చేపముక్కలును వాటిపై సర్దాలి. ఇలా చల్లారిన తర్వాత చేప ముక్కలని వేయడం వల్ల చేప వేడికి విడిపోకుండా ఉంటుంది. ఆ బాణలిలో అరగ్లాసు నీళ్లు, కరివేపాకు వేసి పొయ్యి మీద పెట్టాలి. అది మరుగుతుండగా చింతపండు రసాన్ని ముక్కలకు తగ్గట్టుగా వేసుకుని ఆ తరువాత తగినంత ఉప్పు చేర్చాలి. ముక్క బాగా ఉడికి చక్కగా వాసన వస్తుండగా అందులో మిగిలిన చేప మసాలాను వేసి దింపేయాలి. దానిపై కొద్దిగా కొత్తిమీర వేసి అలంకరించుకొంటే చేపల పులుసు సిద్ధం. వేడివేడిగా లేదా బాగా చల్లారిన తర్వాత ... ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది