ఒక కప్పు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పాలను బాణలిలో పోసి మరగనివ్వాలి, మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి పాలు నాలుగో వంతు ఇంకే వరకూమరిగించాలి.
మరొక పాత్ర (అడుగు భాగం మందంగా ఉండేది) తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కిస్మిస్, బాదం, చిరోంజి, పిస్తా, మెలన్ గింజలను వేయిం చి పక్కకు పెట్టుకోవాలి. మిగిలి న నేతిలో సేమ్యాలను దోరగా వేయించుకొని ఇదివరకు మరింగించి పెట్టుకున్న పాలను పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుండగా కర్జూరం, కుంకు మపువ్వు కలిపిన పాలను పోసి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడింకిం చాలి. సేమియా బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి, దీనిని వేడిగా అయినా వడ్డించుకోవచ్చు లేదా ఫ్రిజ్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు.