సిమ్లా పులావ్
  • 481 Views

సిమ్లా పులావ్

కావలసినవి:

  • బాస్మతిబియ్యం - పావు కేజీ
  • ఎల్లో క్యాప్సికమ్ - 1, రెడ్‌క్యాప్సికమ్ - 1
  • గ్రీన్ క్యాప్సికమ్ - 1, స్వీట్‌కార్న్‌గింజలు - కొద్దిగా
  • మిరియాలపొడి - టీ స్పూన్
  • ఉప్పు - తగినంత, పచ్చిబఠాణీ - కొద్దిగా
  • నూనె - 4 టీ స్పూన్లు
  • బటర్ - 2 టీ స్పూన్లు
  • అజినమోటో - చిటికెడు

విధానం:

బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి.బాణలిలో బటర్ వేసి కాగాక తరిగి ఉంచుకున్న కూరగాయముక్కలు వేసి వేయించాలి.మిరియాలపొడి, ఉప్పు వేసి కొద్దిగా వేగిన తరువాత అజినమోటో వేసి కలపాలి.ఉడికించిన అన్నాన్ని ఒక పెద్ద పాత్రలో వేసి దాని మీద వేయించి ఉంచుకున్న కూరముక్కలు, మిరియాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.