రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికించుకుని. చల్లారాక పెంకు తీసి అక్కడక్కడా గాట్లు పెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడిచేసి అందులో పసుపు, గుడ్లు, తగినంత ఉప్పు వేసి వేయించాలి. ఐదు నిమిషాలయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేయించాలి. కాసేపయ్యాక అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చాలి. ఇవన్నీ బాగా వేగాక రొయ్యలు ఆ తరువాత కారం వేసి కలిపి కాసిన్ని నీళ్లు చల్లి మూతపెట్టేయాలి. కాసేపటికి కూర తయారవుతుంది. గరం మసాలా చల్లి దింపే ముందు కొత్తిమీర తురుముతో అలంకరిస్తే సరిపోతుంది. నోరూరించే కోడిగుడ్డు రొయ్యల కూర సిద్ధం.