చిన్న ఉసిరి ఆవకాయ
 • 526 Views

చిన్న ఉసిరి ఆవకాయ

కావలసినవి:

 • చిన్న ఉసిరికాయలు - 1కేజీ
 • పసుపు - 25 గ్రా.
 • పచ్చళ్ల కారం పొడి - 125గ్రా.
 • ఉప్పు - 250 గ్రా.
 • జీలకర్ర పొడి - 50 గ్రా.
 • మెంతి పొడి - 2 టీ. స్పూన్స్
 • ఆవ పొడి - 100 గ్రా.
 • నువ్వులు 50 గ్రా.
 • నిమ్మ రసం - 1/2 కప్పు.
 • నూనె 250 గ్రా.
 • ఇంగువ - 1/4 టీ స్పూన్
 • ఆవాలు - 1 టీ స్పూన్
 • జీలకర్ర - 1 టీ స్పూన్
 • మెంతులు - 1/2 టీ స్పూన్

విధానం:

నూనె వేడి చేసి శుభ్రంగా కడిగి తుడిచిన చిన్న ఉసిరికాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. వీటిని ఒక వెడల్పాటి గినె్నలో తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో ఇంగువ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడాక దింపేయాలి.
నూనె కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఇలా చేయడంవల్ల పచ్చివాసన పోతుంది. ఉసిరికాయలలో ఉప్పు, కారం పొడి, ఆవ పొడి, మెంతిపొడి, నువ్వులు, పసుపు వేసి ఉండలు లేకుండా కలిపి అల్లం వెల్లుల్లి ఉన్న నూనె, నిమ్మరసం వేసి బాగా కలియబెట్టి జాడీలోకి ఎత్తిపెట్టుకోవాలి.