సోన్ పపాడి
  • 859 Views

సోన్ పపాడి

కావలసినవి:

  • శెనగ పిండి: 2cups
  • మైదా: 2cups
  • పంచదార: 3cups
  • నెయ్యి: 250grms
  • నీళ్లు: 2cups
  • పాలు: 2tbsp
  • యాలకులు పొడి : 1/2tsp
  • బాదం, గుమ్మడి గింజలు, కర్బూజ గింజలు(లోపలి తెలుపుగింజలు)(2tsp)

విధానం:

ముందుగా ఒక గిన్నెలోకి శెనగపిండి, మైదా పిండిని తీసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.  ఇప్పుడు ఒక సాస్ పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో శెనగపిండి, మైదాపిండి మిశ్రమాన్ని వేసి, తక్కువ మంట మీద వేయించుకోవాలి. పిండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.  పిండి చల్లారేంతలోపు పంచదార పాకం(సుగర్ సిరప్)తయారు చేసుకోవాలి. రెండు కప్పుళ నీళ్ళు, పాలు, పంచాదార వేసి తక్కువ మంటమీద పంచదార పాకం చిక్కబడేంత వరకూ కలుపుతూ సిరప్ ను తయారు చేసుకొంటాం. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పిండిని పోసి, సన్నిని ఒక గరిటతో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయంగా ఈ మిశ్రం దారం వంటి రేకులను(పోగుపోగుగా) ఏర్పరుస్తూ గట్టిపడుతుంది.  ఈ మిశ్రమాన్ని ఒక ఇంచ్ మంద ఉన్న గిన్నె లేదా ప్లేట్ పోసి, ఆ వేడి మీదనే యాలకుల పొడి, బాదం, గుమ్మడి, కర్బూజ గింజలను గార్నిష్ చేసుకోవాలి.  ఈ పదార్థాం చల్లబడిన తర్వాత చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. అంతే సోన్ పప్పిడి రెడీ. దీని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వచేసుకోవచ్చు.