ముందుగా ఉసిరికాయలను ముక్కలు చేసుకోవాలి. కందిపప్పు, ఉసిరిముక్కలను విడివిడిగా ఉడకబెట్టాలి. బాణలిలో నూనె వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తరవాత పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న ఉసిరిముక్కలను అందులో వేసి ఒకసారి దోరగా వేయించాలి. చివరగా ఉడికించుకున్న పప్పు, ఉప్పులను అందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. రుచికరమైన ఉసిరికాయపప్పు తయార్