మసాలా మరమరాలు
 • 520 Views

మసాలా మరమరాలు

కావలసినవి:

 • మరమరాలు - పావు కేజీ
 • వేరుశనగపప్పు (పల్లీలు) - అర కప్పు
 • వేయించిన శనగపప్పు (పుట్నాలు) - అర కప్పు
 • వెల్లుల్లి రేకలు - 20 (మెత్తగా రుబ్బాలి)
 • ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు
 • ఉప్పు - టేబుల్ స్పూన్ లేదా తగినంత
 • మిరప్పొడి - టేబుల్ స్పూన్,
 • రసం పొడి - టేబుల్ స్పూన్
 • పసుపు - పావు టీ స్పూన్,
 • కరివేపాకు - కట్ట
 • తాలింపు గింజలు - కొద్దిగా,
 • నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు

విధానం:

బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు వేయించాలి. తర్వాత వేరుశనగపప్పు, వేయించిన శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత కరివేపాకు వేసి దించాలి. అందులో ఉప్పు, మిరప్పొడి, పసుపు, ఎండుకొబ్బరి తురుము, రసం పొడి వేసి బాగా కలపాలి. ఇందులో మరమరాలను వేసి సమంగా కలిసే వరకు కలిపితే మసాలా మరమరాలు రెడీ. ఇవి వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలు ఇలా తినడానికే ఇష్టపడతారు. పెద్దవాళ్లు కావాలనుకుంటే తినే ముందు ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర కలుపుకోవచ్చు.