మసాలా మజ్జిగ
 • 574 Views

మసాలా మజ్జిగ

కావలసినవి:

 • పెరుగు – 2 కప్పులు
 • ఉప్పు – తగినంత
 • జీలకర్ర పొడి – 1/2 tsp
 • పచ్చిమిరపకాలు – 2
 • కరివేపాకు – 1 రెమ్మ
 • కొత్తిమిర – 2 రెమ్మలు
 • ఆవాలు – చిటికెడు
 • జీలకర్ర – చిటికెడు
 • నూనె లేదా నెయ్యి- 1 tsp
 • నీళ్లు -4 కప్పులు

విధానం:

ఈ మజ్జిగ పల్చగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. పెరుగు, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, నీళ్లు కలిపి బాగా గిలక్కొట్టాలి. చిన్న గరిటలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి  కలిపి మజ్జిగలో వేసి కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమిర కూడా వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి. ఇలా పెద్ద గిన్నెడు చేసి ప్రిజ్ లో పెట్టి  దాహం వేయగానే గ్లాసుడు తాగితే సరి.  దాహం తీరుతుంది. ఆరోగ్యానికి కూడా  మంచిది.