టోమాటో మసాలా బజ్జీ
 • 373 Views

టోమాటో మసాలా బజ్జీ

కావలసినవి:

 • టొమాటోలు - అరకిలో
 • బంగాళాదుంపలు - అరకిలో
 • నూనె - వేయించేందుకు సరపడా
 • గరంమసాలా - 2 టేబుల్‌ స్పూన్లు
 • కొత్తిమీర - ఒక కప్పు
 • పెసరపప్పు - 4 టేబుల్‌ స్పూన్లు
 • ఉల్లిపాయలు - 3
 • పచ్చిమిర్చి - 4
 • శనగపిండి - ఒక కప్పు
 • తయారు చేసే విధానం...

విధానం:

టొమాటోలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమాటాల్లో కూరాలి. ఈ టమాటాలను జారుగా కలిపి ఉంచిన శనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే దాకా వేయించి తీసివేయాలి. అంతే టమాటా మసాలా బజ్జీ రెడీ. వీటికి గ్రీన్‌ చట్నీ కాంబినేషన్‌ చాలా బాగుంటుంది.