ఉల్లికాడ గుడ్డు వేపుడు
  • 417 Views

ఉల్లికాడ గుడ్డు వేపుడు

కావలసినవి:

  • కోడిగుడ్లు - 4
  • ఉల్లికాడలు - పావుకిలో
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం - చిన్నముక్క
  • కారం - అర టీ స్పూన్‌
  • ఉప్పు - తగినంత
  • పసుపు - పావు టీస్పూన్‌
  • నూనె - 2 టేబుల్‌ స్పూన్లు

విధానం:

ఉల్లికాడలపై పొర తీసి వేళ్లు నీటిలో బాగా కడగాలి. చాకుతో ఈ కాడల్ని సన్నని ముక్కలుగా కోసం ఉంచాలి. పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క లుగా తరిగి పెట్టు కోవాలి. ఓ బాణలి లో నూనె వేసి కాగిన తరువాత ఉల్లికాడలు, పచ్చిమిర్చి, అల్లం, కారం ఉప్పు అన్నీ వేసి పొడిపొడిగా అయ్యే వరకూ వేయించాలి. ఇది అన్నంలోకి చపాతీల్లోకీ కూడా బాగుంటుంది.