పోపు కోసం:-
ఎండుమిర్చి - 2, జీలకర్ర - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను పసుపు - చిటికెడు, నెయ్యి - టీ స్పూను, ఇంగువ - చిటికెడు
శనగపప్పును అరగంటసేపు నానబెట్టి నీరు వంపేయాలి. అందులో పచ్చికొబ్బరితురుము, పచ్చిమిర్చి, అల్లం, ధనియాలు, జీలకర్ర, ఇంగువ అన్నీ కలిపి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. శుభ్రంగా కడికిన ఉల్లికాడలను మెత్తగా ఉడికించాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, తగినంత నీరు పోసి మెత్తగా మరో పదినిముషాలు ఉడికించాలి. స్టౌ మీద బాణలి పెట్టి టీ స్పూను నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి దానిని ఉడికించిన మిశ్రమంలో వేయాలి. తరవాత స్టౌవ్ మించి దించి ఈ మొత్తాన్ని పెరుగులో వేసి చివరగా ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇది అన్నం, చపాతీ, పూరీ, దోసెలతో తీసుకోవచ్చు. ఇందులో పావుకప్పు కారాబూందీ కూడా పైన చల్లుకోవచ్చు.