సేమ్యా స్ప్రింగ్ రోల్స్
  • 315 Views

సేమ్యా స్ప్రింగ్ రోల్స్

కావలసినవి:

  • సేమ్యా - కప్పు
  • మిక్స్‌డ్ వెజిటబుల్స్ (క్యారట్, బీన్స్, క్యాబేజీ, బఠానీలు,
  •  క్యాప్సికమ్.. తరుగు మొదలైనవి) - కప్పు
  • ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
  • సోయా సాస్ - టేబుల్‌స్పూన్
  • ఉప్పు, మిరియాలపొడి - తగినంత
  • నూనె - 2 టీ స్పూన్లు
  • రోటీ కోసం మైదా - కప్పు

విధానం:

మైదాలో నీళ్లు కలిపి పూరీపిండిలా కలిపి పక్కన ఉంచాలి. సేమ్యాను ఉడికించి, పక్కన ఉంచాలి. పాన్‌లో నూనె వేసి, కాగాక, ఉల్లిపాయల తరుగు, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత మిక్స్‌డ్ వెజిటబుల్స్ వేసి కలిపి, ఉడికించాలి. బాగా వేగిన తర్వాత ఉప్పు, సేమ్యా వేసి కలపాలి. పైన మిరియాల పొడి చల్లి, దించాలి. మైదాను చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పలచని రోటీ చేయాలి. దీంట్లో తగినంత సేమ్యా మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ పెట్టి, రోల్ చేసి అన్ని వైపులా మూసేయాలి. ఇలా అన్నింటిని చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె పోసి, కాగిన తర్వాత రోల్స్‌ని నూనెలో వేసి అన్నివైపులా డీప్ ఫ్రై చేయాలి. ఈ రోల్స్‌ని ఏదైనా సాస్ లేదా జ్యూస్‌తో సర్వ్ చేయాలి.