స్టఫ్డ్‌ టమాటా
  • 279 Views

స్టఫ్డ్‌ టమాటా

కావలసినవి:

  • మీడియం సైజ్‌ టమాటాలు - 5-6
  • పనీరు తురుము - 100-150 గ్రా.
  • ఉల్లిపాయ - 1 సన్నగా తరిగి
  • కొత్తిమీర - సన్నగా తరిగి
  • పచ్చి మిర్చి - 2 సన్నగా తరగాలి
  • ఉప్పు - తగినంత
  • కారం - తగినంత
  • గరం మసాలా - తగినంత
  • పసుపు - 1/4 టీ స్పూన్‌
  • చీజ్‌ తురుము - 1 టేబుల్‌ స్పూన్‌
  • నూనె - 1 టేబుల్‌ స్పూన్‌

విధానం:

టమాటాలను శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. తర్వాత టమాటా పై భాగంలో తొడిమ దగ్గర గుండ్రంగా కత్తిరించాలి. తర్వాత మధ్యలో ఉన్న పదార్ధాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి. దీనిని ఒక పక్కన పెట్టి పైన తీసేసిన భాగాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కొద్ది నూనె వేసి వేడి చేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకొని మెత్తగా అయ్యే వరకూ వేయించాలి. ఇప్పుడు టమాటోలో తీసిన గుజ్జును, టమాటా ముక్కలను వేసి ఒక నిమిషం వేయించి అందులో మసాలాలు వేసి మరొక నిమిషం వేగనివ్వాలి. తర్వాత అందులో పనీర్‌ వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. తర్వాత దానిని పక్కకి తీసి ఈ మిశ్రమాన్ని టమాటాల్లో నింపాలి. దానిపై తురిమి పెట్టుకున్న చీజ్‌, కొత్తిమీరను వేయాలి. తర్వాత ప్రెషర్‌ కుక్కర్‌ ప్లేట్‌లో పెట్టి దాని పై వెన్న వేసి ఒక విజిల్‌ వచ్చే వరకూ ఉడకనివ్వాలి. లేకుంటే దానిని ఒవెన్‌లో 200 డిగ్రీల వేడితో ఒక ఇరవై నిమిషాల పాటు బేక్‌ చేసుకోవచ్చు. దీనిని వేడి వేడిగా సర్వ్‌ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.