స్వీట్‌ కార్న్‌ కబాబ్‌
  • 795 Views

స్వీట్‌ కార్న్‌ కబాబ్‌

కావలసినవి:

  • స్వీట్‌కార్న్‌ - 3 కప్పులు,
  • ఉడికించిన బంగాళదుంప - 1,
  • శనగపిండి - అరకప్పు,
  • అల్లం వెల్లుల్లి ముద్ద - 3 స్పూన్లు,
  • నానబెట్టిన శనగపప్పు - అరకప్పు,
  • ఉప్పు - తగినంత,
  • కొత్తిమీర తరుగు - అరకప్పు,
  • గరం మసాలా - ఒకటిన్నర స్పూన్‌,
  • నూనె - వేయించడానికి సరిపడా

విధానం:

స్వీట్‌కార్న్‌ని మిక్సీలో వేసుకుని బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి పైన చెప్పిన మిగిలిన పదార్థాలన్నీ కలిపాలి. ఈ మిశ్రమాన్ని కబాబ్‌లా చేసుకుని నానబెట్టిన శనగపప్పు అద్దాలి. వీటిని కాగిన నూనెలో వేయించుకుంటే చాలు. స్వీట్‌ కార్న్‌ కబాబ్‌ రెడీ. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి