స్వీట్‌కార్న్ హల్వా
  • 268 Views

స్వీట్‌కార్న్ హల్వా

కావలసినవి:

  • స్వీట్‌కార్న్‌ పేస్టు - ఒక కప్పు,
  • పంచదార - ఒక కప్పు
  • జీడి పప్పు - ఒక టేబుల్‌ స్పూన్‌,
  • కిస్‌మిస్‌ - ఒక టేబుల్‌ స్పూన్‌
  • నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు
  • యాలకుల పొడి - అర టీ స్పూన్‌

విధానం:

మందపాటి గిన్నె స్టౌ మీద పెట్టి వెలిగించాలి. అందులో నెయ్యి వేసి వేడి చేసి ముందుగా జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్వీట్‌కార్న్‌ పేస్ట్‌ వేసి పది నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత చక్కెర వేసి బాగా తిప్పాలి. అది దగ్గరగా అయ్యే వరకూ కలుపుతూ ఉండాలి. చివరలో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ కలిపి దించుకోవాలి. అంతే హల్వా రెడీ. దీన్ని వేడిగానైనా, చల్లార్చి తిన్నా బాగుంటుంది.