స్వీట్‌కార్న్ సూప్
  • 422 Views

స్వీట్‌కార్న్ సూప్

కావలసినవి:

  • చిక్కుడుగింజలు - 50 గ్రా.
  • క్యారట్ ముక్కలు - పావు కప్పు,
  • పచ్చి బఠాణీలు - పావు కప్పు
  • స్వీట్‌కార్న్ - అర కప్పు,
  • ఉల్లితరుగు - అర కప్పు
  • సోయాసాస్ - స్పూను,
  • కార్నప్లోర్ - రెండు స్పూన్లు
  • మిరియాలపొడి - కొద్దిగా,
  • ఉప్పు - తగినంత

విధానం:

ముందుగా కూరముక్కలన్నింటినీ ఉడికించి నీటిని వడకట్టాలి. ఈ నీటిలో స్వీట్‌కార్న్, ఉప్పు, మిరియాలపొడి వేసి ఐదు నిమిషాలు ఉడకనీయాలి. కార్న్‌ఫ్లోర్‌ను చల్లటి పాలలో కలిపి, ఉడుకుతున్న మిశ్రమంలో పోస్తూ చిక్కగా అయ్యేవరకు కలిపి దించేయాలి. సోయా సాస్, ఉప్పు, మిరియాలపొడి వేసి స్వీట్‌కార్న్ సూప్ సర్వ్ చేయాలి.