స్వీట్‌ కార్న్‌ సూప్‌
  • 417 Views

స్వీట్‌ కార్న్‌ సూప్‌

కావలసినవి:

  • కావాల్సిన పదార్థాలు
  • స్వీట్‌ కార్న్‌-కప్పు,
  • ఉల్లి కాడలు-అర కప్పు,
  • కూరగాయలు ఉడికించిన నీళ్లు- మూడు కప్పులు,
  • టమాటా సాస్‌-ఐదు చెంచాలు,
  • దాల్చిన చెక్క-కొద్దిగా,
  • జీలకర్ర -చెంచా,
  • మిరియాలు- చెంచా,
  • ఉల్లిపాయ తరుగు -అర కప్పు,
  • టమాటా-ఒకటి,
  •  పచ్చి మిర్చి-నాలుగు,
  • ఉప్పు, పంచదార- తగినంత

విధానం:

ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. అలానే శుభ్రంగా ఉన్న వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి. ఉల్లిపాయ ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్క జొన్నలను కూరగాయలు ఉడికించిన నీళ్లలో వేసి పొయ్యి మీద పెట్టాలి. కొద్దిసేపటికి ఉప్పు, ఉల్లి కాడలు, టమాటా సాస్‌ వేసి బాగా మరిగించాలి. సూప్‌ చిక్కగా అవుతుంది. అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది.