స్వీట్‌కార్న్ హల్వా
 • 428 Views

స్వీట్‌కార్న్ హల్వా

కావలసినవి:

 • స్వీట్‌కార్న్ - 4 కప్పులు
 • కొబ్బరి కోరు - 1 కప్పు
 • నెయ్యి - 1 కప్పు
 • యాలకులు -5
 • జీడిపప్పు- 12
 • పంచదార - 2 కప్పులు
 • కిస్‌మిస్ -12
 • కేసరి రంగు - 1 చెంచా
 • పాలు - 1 కప్పు
 • కుంకుమ పువ్వు - 1 చెంచా
 • బాదం పప్పు - 12

విధానం:

ముందుగా స్వీట్‌కార్న్ గింజలను బాగా కడిగి మిక్సీ పట్టాలి. బాణలిలో నెయ్యి వేగాక ఈ ముద్దను దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి కోరు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఎర్రగా వేగాక పంచదార, మిగిలిన నెయ్యి వేసి ఉడకనివ్వాలి. ఘుమఘుమ వాసన వస్తుండగా పాలల్లో కేసరిరంగు వేసి ఇందులో కలపాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్, కుంకుమ పువ్వు వేయాలి. బాగా ఉడికి విడిపోతుండగా నెయ్యి రాసిన పళ్లెంలో పోసి సమానంగా సర్దాలి. చల్లారాక ముక్కలుగా చేసుకోవాలి. ముద్దగా తినాలనుకుంటే కప్పుల్లో వేసుకుని తినవచ్చు