స్వీట్‌ వెజిటెబుల్‌ బాత్‌
  • 294 Views

స్వీట్‌ వెజిటెబుల్‌ బాత్‌

కావలసినవి:

  • కాలీఫ్లవర్‌ పువ్వు చిన్నది - 1
  • బీన్స్‌ (తాజావి) - 50
  • కాప్సికమ్‌ బెంగుళూరు మిర్చి - 1
  • ఉల్లిపాయ చక్రాలు - 2
  • పైనాపిల్‌ స్లైసెస్‌ - 5
  • రైస్‌ఫ్లోర్‌ - రెండు టీ స్పూన్లు
  • రిఫైండ్‌ ఆయిల్‌ - 50 గ్రా
  • ఉప్పు - రుచికి సరిపడినంత
  • చిన్న క్యారెట్లు - 2
  • టోమాటో కెచెప్‌ - రెండు టీ స్పూన్లు
  • చిల్లీసాస్‌ - రెండు టీ స్పూన్లు
  • ఆరెంజ్‌ జ్యూస్‌ - రెండు టీ స్పూన్లు
  • చింతపండు రసం - ఒక టీస్పూన్లు

విధానం:

కాలీఫ్లవర్‌ పూలను కొద్దిగా కాడతో తుంచుకోవాలి. వాటిని ఉప్పునీటిలో కాని వేడి నీటిలో వేసుకుని పావు గంట సేపు ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి పావు గంట ఆరబెట్టాలి. క్యారెట్‌ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయలను రౌండ్‌ గాకట్‌ చేసుకోవాలి. కాప్సికమ్‌ను కూడా చిన్నవిగా పొడవుగా కట్‌ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌ మూడు టీ స్పూన్లు కొంచెం వేడి నీటిలో కలుపుకుని పేస్టులా తయారు చేసుకోవాలి. స్వీట్‌ పేస్ట్‌ కొంచెం చేయాలి. అందులో స్టౌపై పాన్‌ వుంచి అందులో 2 స్పూన్ల ఆయి ల్‌ వేసి వేడి చేసి అందులో కట్‌ చేసుకున్న వెజిటబుల్స్‌ అన్నీ వేసి అందులో ఈ స్వీట్‌ పేస్ట్‌ని వేసి కలుపుకోవా లి. కొంచెం ఉప్పు వేసుకోవాలి.

అన్నింటిని సన్నని సెగ మీద వేగనివ్వాలి. పావు గంట తరువాత దించుకుని చల్లారనివ్వాలి. స్వీట్‌ వెజిటబుల్‌ పేస్ట్‌ బజారులో దొరు కుతుంది. అది ఈ మగ్గిన కూరగాయలతో, కార్న్‌ఫ్లోర్‌ పేస్ట్‌ వేసి కలపాలి. మళ్లీ అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకుని మూడు నిమిషాలు మూతపెట్టి ఉడకనివ్వా లి. ఉడికిన తరువాత దించుకుని పైన చెప్పి స్వీట్‌ పేస్ట్‌ వేయాలి. టమోటాకెచప్‌, చిల్లీసాస్‌, ఆరెంజ్‌జ్యూస్‌, పై నాపిల్‌ జ్యూస్‌, చింతపండు రసం వీటన్నింటినీ కలిపి ఒక గిన్నెలోపోసుకుని బాగా కలుపుకోవాలి. కూరలు ఉడికిన తర్వాత దించుకుని అందులో పైన చెప్పిన వా టన్నింటినీ కలిపేసుకుని స్టౌమీద పెట్టుకోవాలి. 2 లేదా మూడు నిమిషాలు అలా వుంచేసి దించేసుకోవాలి. ఒ క వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో పదార్థాన్ని వే యాలి. దానిపైన స్వీట్‌ పేస్ట్‌ని కొద్దిగా వేసుకోవాలి. ఇది తియ్యగా, కారంగా, పుల్లగా ఎంతో టేస్ట్‌గా వుంటుంది.