చింత చిగురు మాంసం
  • 508 Views

చింత చిగురు మాంసం

కావలసినవి:

  • చింతచిగురు-అరకిలో మాంసం ( చికెన్‌ లేదా మటన్‌) ,
  • అరకిలో కొబ్బరి తురుము: 2 టీ స్పూను,
  • కొత్తిమీర- కట్ట,ధనియాల పొడి-టీ స్పూన్లు
  • అల్లంవెల్లుల్లిముద్ద- టీ స్పూను,
  • జీలకర్ర- టీ స్పూను, పుదీనా-కట్ట ,
  • ఆవాలు-టీ స్పూను
  • నూనె-టేబుల్‌ స్పూను,
  • ఉల్లిపాయ- ఒకటి
  • కారం -2 టేబుల్‌ స్పూను,
  • ఉప్పు-రుచికి సరిపడా
  • పసుపు-చిటికెడు,
  • గరం మసాలా-టీ స్పూను

విధానం:

నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కలు కూడా వేసి అవి వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు మటన్‌ లేదా చికెన్‌ ముక్కలు వేసి ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి కలపాలి. తరువాత ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మాంసం ఉడికే వరకూ ఉంచాలి. ఉడికిన తరువాత చింత చిగురు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి ఓ నిమిషం ఉంచి దించాలి.