చికెన్‌ టెస్టీ
  • 338 Views

చికెన్‌ టెస్టీ

కావలసినవి:

  • బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజి
  • చింతకాయలు (లేతవి) - 100 గ్రా
  • ఉల్లిపాయలు - 100 గ్రా
  • అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూన్‌
  • కొబ్బరి పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌
  • కారంపొడి - ఒక టేబుల్‌ స్పూన్‌
  • పసుపు - చిటికెడు
  • లవంగాలు, యాలకుల పొడి - చిటికెడు
  • పచ్చిమిరపకాయలు - నాలుగు
  • ఉప్పు - తగినంత
  • కొత్తిమీర - తగినంత

విధానం:

ముందుగా చింతకాయలు, ఉల్లిపాయలు మెత్తని పేస్ట్‌లా చేసి ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కల్లో వేసి బాగా కలిపి పది నిమిషాలు నాన బెట్టాలి. స్టవ్‌పై బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక పచ్చిమిరప కాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగించాలి. తర్వాత చికెన్‌ ముక్కలను అందులో వేసి చిటికెడు పసుపు చేర్చి గరిటెతో కలుపుతూ కొద్ది సేపు వేగించాలి. తర్వాత కారం పొడి, ఉప్పు, కొబ్బరిపొడి, లవంగాలు, యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి.