థాయ్ ఫిష్ కర్రీ
 • 430 Views

థాయ్ ఫిష్ కర్రీ

కావలసినవి:

 • చేపలు- అర కేజీ
 • టొమాటోలు - 2
 • చింతపండు - 25 గ్రా.
 • మామిడికాయ - సగం ముక్క
 • ఉల్లిపాయ తరుగు - 3 టీ స్పూన్లు
 • కారం- టేబుల్ స్పూన్
 • నూనె - టేబుల్ స్పూన్
 • నిమ్మరసం - 2 టీ స్పూన్లు
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • ఆవాలు - అర టీ స్పూన్
 • మెంతులు - అర టీ స్పూన్

విధానం:

ముందుగా చేపముక్కలను శుభ్రపరిచి, వాటికి ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి రసం తీసి దానిలో ఉప్పు, పసుపు కారం కలిపి పక్కన ఉంచాలి. మామిడికాయ పై తొక్క తీసి ముక్కలు చేయాలి. ఉల్లిపాయలు, టొమాటోలు తరిగి ఉంచాలి. స్టౌ మీద మూకుడు ఉంచి మెంతులు, జీలకర్ర వేసి వేయించి దించాలి. చల్లారక పొడి చేయాలి. మూకుడులో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక కరివేపాకు, చింతపండు రసం, టొమాటో ముక్కలు వేసి, కలిపి మూతపెట్టాలి.  ఐదు నిమిషాల తర్వాత చేపముక్కలను, మామిడికాయ ముక్కలను వేసి ఉడికించాలి. తర్వాత జీలకర్ర, మెంతి పొడి వేసి, కలిపి, రసం కొంచెం చిక్కబడే వరకు ఉంచి, తర్వాత దించేయాలి. వేడి వేడి అన్నంలోకి ఈ ఫిష్ కర్రీ వడ్డించాలి.