థాయ్ ప్రాన్ కేక్
  • 488 Views

థాయ్ ప్రాన్ కేక్

కావలసినవి:

  • రొయ్యలు - 300 గ్రా.
  • పండు మిరప పేస్ట్ - 2 టీ స్పూన్లు
  • లెమన్ గ్రాస్ - 3 టీ స్పూన్లు
  • వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూన్లు
  • కారం - 2 టీ స్పూన్లు
  • నిమ్మరసం - 2 టీ స్పూన్లు
  • ఉప్పు - 2 టీ స్పూన్లు
  • ఫిష్ సాస్ - 2 టీ స్పూన్లు
  • తులసి ఆకులు - 2 టీ స్పూన్లు
  • నూనె - 2 టీ స్పూన్లు
  • చిల్లీ ఆయిల్ - 2 టీ స్పూన్లు
  • ఉల్లికాడలు - 25 గ్రా.
  • కార్న్ ఫ్లోర్- 30 గ్రా.
  • అల్లం పేస్ట్ - 2 టీ స్పూన్లు
  • నిమ్మ ఆకులు - 2

విధానం:

రొయ్యలను శుభ్రపరిచాలి. చిల్లీపేస్ట్, లెమన్ గ్రాస్, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, ఫిష్ సాస్, తులసి ఆకులు, చిల్లీ ఆయిల్, ఉల్లికాడలు, కార్న్‌ఫ్లోర్, అల్లం పేస్ట్ రొయ్యలలో వేసి కలపాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసి, చేత్తో అదమాలి. వీటిని నాన్‌స్టిక్ పాన్‌పై కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక రెండు వైపులా కాల్చి, తీయాలి. గార్లిక్ సాస్‌తో తయారు చేసుకున్న థాయ్ ప్రాన్ కేక్‌లను వేడి వేడిగా సర్వ్ చేయాలి.