తండై
  • 436 Views

తండై

కావలసినవి:

  • పాలు - అర లీటరు (కాచి చల్లార్చాలి)
  • నీరు - 400 మి.లీ
  • బాదం - 20 పప్పులు
  • చక్కెర - రెండు కప్పులు
  • గసగసాలు - 2 టేబుల్ స్పూన్లు
  • సోంపు - టీ స్పూన్
  • జీలకర్ర - టీ స్పూన్
  • మిరియాలు - అర టీ స్పూన్
  • కుంకుమ పువ్వు - చిటికెడు

విధానం:

బాదం పప్పులను రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఉదయం గసగసాలు, జీలకర్ర, మిరియాలు, సోంపును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. తర్వాత నానబెట్టిన బాదంను పొట్టు తీసి పప్పును పాలు వేస్తూ మెత్తగా పేస్టు అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే ముందుగా చేసుకున్న పొడిని, మిగిలిన పాలను వేసి అన్నీ కలిసేలా ఒకసారి తిప్పాలి. ఈ మిశ్రమాన్ని పలుచని క్లాత్‌తో వడగట్టాలి. క్లాత్ పైన మిగిలిన మిశ్రమంలో చక్కెరను కలిపి అందులో నీటిని పోస్తూ మరొకసారి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడపోయాలి. వీటిని ముందుగా వడపోసి ఉంచిన బాదం పాలతో కలిపి పైన కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.